రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ ఎల్బీ స్టేడియానికి పోటెత్తిన జనం - డ్రోన్ విజువల్స్ చూశారా? - LB Stadium packed with lakhs of people attending
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-12-2023/640-480-20208129-thumbnail-16x9-lbstadium-drone-.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 7, 2023, 5:15 PM IST
|Updated : Dec 7, 2023, 6:21 PM IST
LB Stadium Drone Visuals : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి జనం పోటెత్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలిరావడంతో స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. ప్రమాణ స్వీకార సమయానికి అరగంట ముందు ఏఐసీసీ ప్రముఖులు, సీడబ్ల్యూసీ సభ్యులు, గవర్నర్ సహా ఎమ్మెల్యేలు రావడంతో వారిని చూసేందుకు స్టేడియం బయట కాంగ్రెస్ శ్రేణులు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రముఖులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ సహా మరికొంత మంది ముఖ్య నాయకులు వారు ప్రయాణిస్తున్న కార్లలో నుంచి మధ్యలోనే దిగి కాలినడకన స్టేడియం లోపలికి చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా స్టేడియం లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసినా కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు. మరోవైపు స్టేడియం లోపల జనాలు కిక్కిరిసిపోవడంతో పాసులున్న వారిని కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు.