మహిళా ప్రయాణికులు మర్యాద ఇవ్వడం లేదంటూ లేడీ కండక్టర్ కంటతడి - మహాలక్ష్మీ పథకం
🎬 Watch Now: Feature Video
Published : Dec 27, 2023, 10:25 PM IST
Lady Bus Conductor Cried for Passengers Behaviour : మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఓ మహిళ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ ఆమె బస్సును ఆపేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్డినరీ బస్సులో పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి, తనను ఎక్కనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కండక్టర్ కన్నీటిపర్యాంతమయ్యారు.
Conductor Stopped Bus over Passengers Behaviour : బస్సు డోర్ దగ్గర ఉన్న ప్రయాణికులను జరగాలని రిక్వెస్ట్ చేసినా తనకు చోటు ఇవ్వలేదని ఆమె వాపోయారు. ప్రభుత్వం ఉచిత బస్సు కల్పించిందని, తమకు కండక్టర్ అవసరం లేదంటూ ప్రయాణికులు తనతో ప్రవర్తించారని ఆమె ఆవేదన చెందారు. దీంతో గౌతమిపురం స్టేజీ వద్ద బస్సు ఆపించి, ఉద్యోగం చేయలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. మహిళ ప్రయాణికులు తనతో దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి ప్రయాణికులకు సర్ది చెప్పడంతో ఆమె తిరిగి విధులకు హాజరయ్యారు.