యువతకు కూరగాయలు అమ్మే ఉద్యోగాలు - కాంగ్రెస్ ఇచ్చే జాబ్స్ ఇవేనా : మంత్రి కేటీఆర్
🎬 Watch Now: Feature Video
KTR Direction to BRS Leaders in Election Campaign : యువతకు కూరగాయలు అమ్మే ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని.. కాంగ్రెస్ నేతలు ఇచ్చే ఉద్యోగాలు ఇవేనా అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సనత్‌నగర్‌లోని బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులకు ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు మంచి చేశామని.. తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని.. వాటిని ప్రజలకు వివరించాలని, దీంతోపాటు పార్టీ నాయకులు ఎప్పుడూ జనం మధ్యలోనే ఉంటామనే భరోసా ఇవ్వాలని తెలిపారు. సనత్‌నగర్‌లో 1000 పడకల ఆస్పత్రి అందుబాటలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
KTR Latest Comments on Revanth Reddy : ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏవేవో చెబుతారని.. వాటిని నమ్మితే మోసపోతారని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో లేనిపోనివి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హడావిడి చేశారని విమర్శించారు. యువతకు కూరగాయలమ్మే ఉద్యోగాలు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని.. కాంగ్రెస్ నేతలు చెప్పే ఉద్యోగాలు ఇవేనా అని ఎద్దేవా చేశారు. బీజేపీ మతం పేరిట పంచాయతీ తప్ప.. ప్రజల గురించి ఆలోచించదని ఆరోపించారు. ప్రజలే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.