KTR Congrats to Kaynes Technology : రాష్ట్రంలో రూ.2,800 కోట్లు పెట్టుబడి పెట్టిన కేన్స్ టెక్నాలజీ సంస్థ
🎬 Watch Now: Feature Video
Published : Oct 25, 2023, 8:34 PM IST
KTR Congrats to Kaynes Technology : హైదరాబాద్ శివారు కొంగరకలాన్ వద్ద కేన్స్ టెక్నాలజీ సంస్థ తమ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేయడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ ఇంజినీరింగ్- అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(OSAT) సదుపాయం ఏర్పాటు చేస్తున్నందుకు కేన్స్ టెక్నాలజీ(Kaynes Technology)కి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేన్స్ సెమీకండక్టర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఏర్పాటుకు 2వేల 800 కోట్లు పెట్టుబడి పెడుతుండగా.. అది పూర్తైతే 2వేల మందిపైనే ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
KTR Latest Tweet on Kaynes Technology : టీహబ్ ఇంక్యుబేటెడ్ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ గురించి తెలిసి గర్వపడుతున్నానని కేటీఆర్(KTR) అన్నారు. విక్రమ్ కోసం బహుళ దశల రాకెట్‌ని ఆవిష్కరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ విస్తరణ సామర్థ్యాలు కలిగి ఉన్న కొన్ని ప్రైవేట్ రాకెట్లలో ఇది ఒకటి అని తెలిపారు. మ్యాక్స్-క్యూ పేరిట కొత్త ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభించిందని వెల్లడించారు. తద్వారా అంతరిక్ష ప్రయోగ వాహనాల నిర్మాణానికి సమగ్రమైన రూపకల్పన, తయారీ, పరీక్షా సౌకర్యాలు వంటివి అందుబాటులోకి వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు.