జనగామ జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు : కేటీఆర్ - కేటీఆర్ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 7:22 PM IST

KTR Condole Death of Jangoan ZP Chairman Sampath Reddy : జనగామ జడ్పీ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా రాజవరం గ్రామానికి వెళ్లి సంపత్‌రెడ్డి పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన వెంట ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అన్ని విధాలుగా తమకు అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కోరారు.

పార్టీ ఆవిర్భావం నుంచి సంపత్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని, కార్యకర్తలకు అండగా నిలవడంలో ముందు వరుసలో ఉండేవారని కేటీఆర్ పేర్కొన్నారు. పద్నాలుగేళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పనిచేశారని గుర్తుచేశారు. ఆయన అకాల మరణం ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను కలచివేసిందని అన్నారు. సంపత్ రెడ్డి నిబద్దత గల నాయకుడన్న ఆయన, రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని పార్టీ కార్యాలయాల్లో సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.