నిమిషంలో 133 పుష్ అప్స్ - గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన హైదరాబాదీ - మేడ్చల్‌లో ప్రపంచ రికార్డు పుష్ అప్స్
🎬 Watch Now: Feature Video
Published : Dec 22, 2023, 10:49 PM IST
Krishna Reddy World Record Pushups : పుష్అప్స్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు మేడ్చల్ జిల్లా పోచారం సంస్కృతి టౌన్ షిప్‌కు చెందిన 48 ఏళ్ల చింతల కృష్ణా రెడ్డి. గతంతో పంజాబ్ యువకుడి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అన్నోజిగూడలో శుక్రవారం తన ప్రతిభను ప్రదర్శించారు. ఒక్క నిమిషంలోనే 133 పుష్అప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ పేరిట ఉన్న రికార్డు (124) బద్దలుకొట్టాడు. ఫలితంగా కృష్ణా రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నాడు.
World Record Pushups in One Minute : ఈ కొత్త రికార్డును ధ్రువీకరించడానికి ప్రయత్నించిన వీడియోలను లండన్‌లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు పంపనున్నట్లు కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత తాను సాధించిన విజయానికి ధ్రువపత్రం అందుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కృష్ణారెడ్డిని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ చంద్రశేఖర్, పోచారం కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి, తదితరులు అభినందించారు.