కైట్స్ అండ్​ స్వీట్స్ ఫెస్టివల్​కు సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం - Kite sweet Fetival 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 10:43 PM IST

Kites And Sweets Festival 2024 : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ 2024కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు అధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కైట్స్ అండ్​ స్వీట్స్ ఫెస్టివల్​ను ప్రభుత్వం నిర్వహించనుంది.

Kites and Sweets Festival at Hyderabad : ఈ కైట్‌ ఫెస్టివల్​లో వివిధ రాష్ట్రాలతో పాటు 16 విదేశాల నుంచి అంతర్జాతీయ కైట్​ క్రీడాకారులు వస్తారని పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి వివరించారు. ఆదేవిధంగా దేశవ్యాప్తంగా మిఠాయిలు ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.