కొద్దిపాటి వ్యాయామాలు, ఆహారపు అలవాట్లలో మార్పులతో డయాబెటిస్‌కు దూరం : కిషన్​రెడ్డి - కిషన్‌రెడ్డి తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 1:26 PM IST

Kishan Reddy on World Diabetics Day : మనిషి రోజువారీ చర్యలు.. మారుతున్న ఆహారపు అలవాట్లతో చక్కెర వ్యాధికి గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శారీరక శ్రమను తగ్గించుకొని కొద్దిపాటి సమయం దొరికినా మొబైల్‌ ఫోన్‌తో గడపడంతోనే డయాబెటిక్ సమస్యను కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ అలవాట్లను మార్చుకుంటే డయాబెటిస్‌ను దూరం పెట్టవచ్చని తెలిపారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా బర్కత్‌పురాలోని ఓ హస్పిటల్‌లో డయాబెటిక్ విభాగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని.. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకొని, శారీరక శ్రమను దూరం పెడుతున్నారన్నారు. ముఖ్యంగా యువత కొద్దిపాటి సమయం దొరికినా మొబైల్‌ ఫోన్‌తోనే గడపడంతో డయాబెటిస్ ముప్పును కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. డయాబెటిస్ వచ్చిందంటే చాలావరకు అంతా అయిపోయిందని అపోహ పడుతున్నారన్నారు. కొద్దిపాటి వ్యాయామాలు, తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే డయాబెటిస్‌ను దూరం పెట్టవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.