Kishan Reddy on BJP Second List : దసరా తర్వాత రెండో జాబితా.. మేడిగడ్డ ఘటనపై కేంద్రానికి లేఖ రాస్తామన్న కిషన్ రెడ్డి - తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 7:05 PM IST
Kishan Reddy on BJP Second List : దసరా తర్వాత బీజేపీ రెండో జాబితా విడుదల చేస్తామని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. పండగ అనంతరం ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తామని.. అగ్రనేతలు రాష్ట్రానికి వస్తారని ఆయన చెప్పారు. ప్రతి ఓటరును నేరుగా కలిసి ప్రధాని మోదీ సందేశాన్ని అందించాలని పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని.. యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని అన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారం చేప్టటాలని సూచించారు.
Kishanreddy Reacts on Medigadda Incident : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో.. ప్రారంభమైనప్పటీ నుంచి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై జలవనరుల శాఖకు లేఖకు రాయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు.. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని దుయ్యబట్టారు.