షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దంపతులు - బాబానిదర్శించుకున్నకిషన్
🎬 Watch Now: Feature Video


Published : Dec 30, 2023, 3:42 PM IST
Kishan Reddy Couple Visited Shirdi Saibaba Temple: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి (kishan Reddy) షిరిడీ లోని సాయి బాబా ఆలయాన్ని (Shirdi Saibaba Temple) కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి సతీమణి సాయిబాబాకు పాద పూజ చేశారు. బాబాకు షిరిడీ మాజే పంఢర పూర్హి హారతి ఇచ్చి విశేష పూజా కార్య క్రమాలు నిర్వహించారు. అనంతరం కిషన్రెడ్డి తీసుకొచ్చిన శాలువాను సాయిబాబా సమాధిపై ఉంచారు.
కిషన్ రెడ్డి కుటుంబం సాయి బాబా సమాధి దర్శన అనంతరం సాయిబాబా సంస్థాన్ (saibaba samsthan) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజతిలక్ బాగ్వే వారిని శాలువాతో సత్కరించారు. శ్రీ సాయి మూర్తి ప్రతిమ (Idol), సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సంస్థాన్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్ తుషార్ షెల్కే, ఇతర సాయి సంస్థల అధి కారులు పాల్గొన్నారు.