పొలంలో 14అడుగుల కింగ్ కోబ్రా.. ఏడాదిగా వ్యవసాయం బంద్!.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ - పెద్ద కింగ్ కోబ్రా వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-08-2023/640-480-19253698-thumbnail-16x9-king-cobra-catching-video.jpg)
King Cobra Catching Video : కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని ఓ రైతు పొలంలో 14 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. అందుకు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించాడు. అనంతరం పామును స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
కొప్ప తాలూకాలోని హోసూర్ గ్రామానికి చెందిన రైతు చిదంబర హెబ్బార్ పొలంలో.. ఏడాదిగా ఈ 14 అడుగుల కింగ్ కోబ్రా నివాసం ఉంటోంది. పొలాన్ని సాగు చేస్తున్న సమయంలో రైతు చిదంబరకు తరచుగా కనిపించేది ఈ కోబ్రా. దీంతో సంవత్సరం పాటు పొలంవైపే వెళ్లడం మానేశాడు ఆ రైతు. కొద్ది రోజుల క్రితం స్నేక్ క్యాచర్ల గురించి తెలుసుకుని.. హరీంద్ర అనే వ్యక్తికి సమాచారం అందించాడు. అనంతరం రైతు చిందంబర పొలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ హరీంద్ర.. చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. అందుకోసం భారీ గుంత తవ్వాడు. అనంతం పామును అడవిలో విడిచిపెట్టాడు. దీంతో పాము బాధ నుంచి రైతు విముక్తి పొందాడు.