Kidney Stones Diet : కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? వీటిని తినడం తగ్గించుకోండి.. లేదంటే! - కిడ్నీలో స్టోన్స్ డైట్ పూర్తి వివరాలు తెలుగులో
🎬 Watch Now: Feature Video
Kidney Stones Diet : కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు.. వాటి రకం ఆధారంగా తినే ఆహారంలో లేదా డైట్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే ఏ రకమైన కిడ్నీ స్టోన్స్ సమస్యకైనా.. శరీరానికి తగిన మోతాదులో నీరు అందించడం చాలా అవసరం. ఇందుకోసం రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. దీంతో శరీరంలో నిల్వ ఉన్న రాళ్లు కరిగి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే మీ బాడీలో యూరిక్ యాసిడ్ స్టోన్ ఉన్నట్లయితే గనుక మీరు రోజూ తీసుకునే ఆహారంలో నిమ్మజాతికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీరు తాగే నీళ్లల్లో రోజు ఒక నిమ్మకాయను పిండుకొని తాగడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్టోన్‌ను కరిగించుకోవచ్చు. ఒకవేళ అది ఆక్సిలేట్ స్టోన్ అయితే గనుక మీరు తినే ఫుడ్‌లో కాల్షియం మోతాదును కొంచెం తగ్గించుకుంటే మేలని సూచిస్తున్నారు నెఫ్రాలజిస్టులు. మరి కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవాలంటే ఎటువంటి డైట్(Kidney Stones Foods To Eat)ను ఫాలో అవ్వాలి.. ఏ ఆహారాన్ని తినడం తగ్గించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.