Congress Khammam Pubilc Meeting : 'జనగర్జన'కు పోటెత్తిన జనం.. ఊహించిన దాని కంటే..! - Rahul Gandhi Latest News
🎬 Watch Now: Feature Video

Khammam Congress Meeting : ఖమ్మం వేదికగా జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభకు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాహుల్‌ను చూసేందుకు అభిమానులు పోటిపడ్డారు. రాహుల్ కారును అభిమానులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో అక్కడి పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి ఓపెన్ టాప్ కారులో అభివాదం చేస్తూ వేదిక వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని గద్దర్ ముద్దు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్కను భుజం తట్టి రాహుల్‌గాంధీ అభినందించారు. పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్న భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు.