Khairatabad Ganesh Nimajjanam 2023 : రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర - తెలంగాణ గణేశుడి నిమజ్జనం సంబరాలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2023, 2:39 PM IST
Khairatabad Ganesh Nimajjanam 2023 : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతోంది. గురువారం రోజున ఈ మహాగణపయ్యను గంగమ్మ ఒడిలో చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు ఈ లంబోదరుడిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటూ.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలుకుతున్నారు.
Khairatabad Ganesh Immersion 2023 : ఇక గురువారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. గణనాథుడిని దర్శించుకునేందుకు ఈరోజే చివరి రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. బడా గణేశ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్ వైపు నుంచి వచ్చేవారికి.. పోలీసులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. భక్తుల రాకతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.