చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుంది : డా.ఖాదర్‌వలీ - ప్రపంచ ఆహార భద్రత కోసం మిల్లెట్స్
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 5:14 PM IST
Khadar Vali on Millets for Global Food Security : మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే పరిష్కారం లభిస్తుందని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలీ అన్నారు. చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుందని తెలిపారు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లోని మేనేజ్ కార్యాలయంలో ఏషియా ఆఫ్రికన్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో తృణధాన్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.
International Year of Millets 2023 : నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు దాదాపు 30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. చిరుధాన్యాలపై ఇతర దేశాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఖాదర్‌వలీ తెలిపారు. తృణధాన్యాల వినియోగం వల్ల ఆహార కొరతనే మాట ఉండదని, ఆహార సార్వభౌమత్యం వెనుకకు వస్తుందని ఖాదర్‌వలీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని భారత్ నేతృత్వం వహించడం గమనార్హ విషయం. సదస్సులో వివిధ చిరుధాన్యాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.