2వేల మంది మహిళల 'ఓనం' నృత్యం- మోదీకి స్వాగతం పలుకుతూ వేడుక!
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 7:50 AM IST
Kerala 2000 Women Dance : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన నేపథ్యంలో త్రిస్సూర్‌లో నిర్వహించిన సంప్రదాయ నృత్య వేడుక ఆకట్టుకుంది. సుమారు 2 వేల మంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వడక్కుమ్నాథ్ ఆలయ ప్రాంగణంలో 'మెగా తిరువథిర' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. త్రిస్సూర్‌లో బీజేపీ మహిళా మోర్చా మీటింగ్‌కు మోదీ బుధవారం హాజరు కానున్నారు. ఆయన పర్యటనను వేడుకలా నిర్వహించాలన్న ఉద్దేశంతో కార్యక్రమం జరిపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయ నృత్య కార్యక్రమం పది నిమిషాల పాటు సాగింది. 'కొంబుమ్ కుడవయారుమ్' అనే గణపతి పాట పాడుతూ మహిళలు నాట్యం చేశారు. రామాయణానికి సంబంధించిన పాటలతో కార్యక్రమాన్ని ముగించారు. సాధారణంగా ఓనం సందర్భంగా ఈ వేడుక నిర్వహిస్తుంటారు.
దీంతో పాటు బుధవారం మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బుధవారం జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారని చెప్పారు.
కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
37 వేల మంది మహిళల 'మహా' నృత్యం- శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ వేడుక
3,782 మంది చిన్నారుల కూచిపూడి నృత్యం - గిన్నిస్ రికార్డు దాసోహం