నడిరోడ్డుపై సీఎం కారు ఆపిన పోలీసులు.. డబ్బు, మద్యం కోసం తనిఖీలు! - కర్ణాటక పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2023, 7:37 PM IST

కర్ణాటక పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనాన్నే తనిఖీ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ముఖ్యమంత్రి కారును ఆపి పరిశీలించారు. బెంగళూరు రూరల్​ జిల్లా దొడ్డబల్లాపుర్ ప్రాంతంలోని హోసహుద్య సమీపంలో చెక్ పోస్ట్ వద్ద ఈ తనీఖీలు జరిగాయి.

శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ అధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనశ్రేణి అదే మార్గంలో వస్తోంది. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్​ను ఆపారు పోలీసులు. అనంతరం ఆ వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయానికి దర్శనం కోసం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు చేసిన ఈ పనిపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్రమ నగదు, మద్యం రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటిని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మొత్తం ఆరు చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశాం. అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా తనిఖీ చేశాం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు." అని బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు.. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఏప్రిల్​ 13న నోటిఫికేషన్​ వెలువడుతుంది. మే 10న పోలింగ్​ జరుగుతుంది. అదే నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.