Karnataka Deputy CM DK Shivakumar Visited Dumping Yard : జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌లో డీకే శివకుమార్ - డీకే శివకుమార్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 7:31 PM IST
Karnataka Deputy CM DK Shivakumar Visited Javaharnagar Dumping Yard : హైదరాబాద్ నగరంలో చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారు.. ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారనే విషయాలను.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డ్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్టలోని వేస్టేజ్ ప్లాంట్‌లను.. ఆయన సందర్శించారు. పవర్ ప్లాంట్ పనితీరును రాంకీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కావడం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన డీకే శివకుమార్.. నగరంలో చెత్త నిర్వహణ బాగుందని.. దీని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు.
CWC Meeting in Hyderabad : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరించిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి- సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ వేదికగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రానున్న లోక్ సభ ఎన్నికల కార్యాచరణ ఖరారు చేయడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. భేటీ కోసం హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ అగ్రనేతలకు ఆదివాసీ నృత్యాలు, డప్పులు, కొమ్ము వాద్యాలతో నేతలకు స్వాగతం పలికారు. కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు.