Karimnagar Cable Bridge Cracks : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించిన నెలకే పగుళ్లు.. ఆందోళనలో ప్రజలు - కరీంనగర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Karimnagar Cable Bridge Cracks : కరీంనగర్ శివారులో నెల రోజుల క్రితం ప్రారంభించిన తీగల వంతెన ప్రహరీ దిమ్మెలకు పగుళ్లు రావడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.220 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించగా.. గత నెల 21 తేదీన ఐటీ పురపాలకశాఖమంత్రి కేటీఆర్ ఈ తీగల వంతెనను ప్రారంభించారు. అయితే భారీ వాహనాలు సైతం వెళ్లవచ్చన్న ప్రభుత్వం.. అసలు వాహనాలనే అనుమతించడం లేదు. దీంతో సందర్శకులు కాలినడకనే కేబుల్ బ్రిడ్జిపైకి వెళుతున్నారు. ఇటీవల ప్రహరీ గోడపై టార్ఫాలిన్లు కప్పడంతో అనుమానం వచ్చిన కాంగ్రెస్ నాయకులు పరిశీలించడంతో పగుళ్లు బయటపడ్డాయని వివిధ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే పగుళ్లు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ పనులు నామమాత్రంగానే జరుగుతున్నాయని ఆ పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.