Kaloji movie shooting in Khammam : ఖమ్మంలో కాళోజీ చిత్రషూటింగ్.. నటించిన రాష్ట్ర ఇన్‌కమ్‌టాక్స్ కమిషనర్ - Khammam District News
🎬 Watch Now: Feature Video
Kaloji movie shooting in Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కోట మైసమ్మ ఆలయ సమీపంలో.. కాళోజీ సినిమా పాటను చిత్రీకరించారు. షూటింగ్లో కాళోజీ పాత్రధారి అశోక్ రెడ్డితో.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్‌లాల్ లావుడియా కలిసి నటించారు. కాళోజీ తెలంగాణ ఉద్యమాన్ని తన కలంతో.. ప్రజలలో చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు. అప్పటి పాలకుల అరాచకాలను తన రచనలతో వ్యతిరేకించి.. జనాలలో పోరాటస్పూర్తిని నిలిపారన్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకలా నిలిచిన కాళోజీ గొప్పతనం అందరికీ తెలిసేలా బయోపిక్ రూపొందించడం ఆనందంగా ఉందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలను కాళోజీ ఇంట్లో చిత్రీకరించామని దర్శకులు తెలిపారు. ఈ మూవీలోని పాటలు బంజారా మహిళలు, డప్పు వాయిద్యాల నడుమ చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు. చిత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఉంటుందని.. అప్పటి ఆచార సంప్రదాయాలు, కట్టుబట్లు, వ్యవహారాలు చిత్రంలో ప్రతిబింబిస్తాయని తెలిపారు.