Malkapeta Reservoir P9 Pump Trial Run : రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్.. కేటీఆర్ హర్షం - rajanna siricilla district latest news
🎬 Watch Now: Feature Video
Malkapeta Reservoir Trial Run : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆదివారం వేకువజామున ఉదయం 12.40 గంటల నుంచి 01.40 వరకు గంటపాటు నిరంతరాయంగా సాగింది. ఈ ట్రయల్‌ను కాళేశ్వరం ప్యాకేజీ-9 ఈఈ గంగం శ్రీనివాస్ రెడ్డి ఎటువంటి అవాంతరాలు జరగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రయల్ రన్ జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.
రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం కావడంపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయాన్ని 15 నుంచి 20 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి అనుగుణంగానే గత నెల మే 23న మొదటి పంపు ట్రయల్ రన్‌ను విజయవంతం కాగా.. ఇప్పుడు రెండో పంపు విజయవంతం చేశారు. దీంతో మల్కపేట జలాశయం రెండు పంపులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.