KA Paul Visit to Secunderabad Constituency : నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తా : కేఏ పాల్ - తుకారాంగేట్‌లోని మాంగర్ బస్తీలో కేఏ పాల్ పర్యటన
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 7:37 PM IST
KA Paul Visit to Secunderabad Constituency : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గమయం చేయడానికి కృషి చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. తుకారాంగేట్‌లోని మాంగర్ బస్తీలో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క అంశం కూడా నెరవేర్చ తగ్గట్టుగా లేదని విమర్శించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని పాల్ మండిపడ్డారు. తుకారాంగేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే దీనికి తార్కాణమని అన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికల బరిలో ఉండాలని కోరుకుంటున్న వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తానని.. ప్రజలు తనను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేఏ పాల్ విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.