KA Paul on Telangana Assembly Elections 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా: కేఏ పాల్ - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Sep 22, 2023, 9:22 PM IST
|Updated : Sep 22, 2023, 10:48 PM IST
KA Paul on Telangana Assembly Elections 2023 : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. ఈ విషయంపై అక్టోబర్ 2న అధికారకంగా తన నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కో-ఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.
అక్టోబర్ 2న జింఖానా మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజాశాంతి పార్టీ ఎన్నికల భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన బహిరంగ సభ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశాన్ని ప్రధాని మోదీ మోసం చేస్తూ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు అవకాశాలు ఇచ్చారని.. వాటిని సద్వినియోగం చేసుకోలేక ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే.. 6 నెలల్లో ప్రజలకు అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు.