KA Paul Complaint to EC on BRS Leaders : 'రాష్ట్రంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు గెలిచే ఛాన్సే లేదు.. బీజేపీ పనైపోయింది' - ఎన్నికల అధికారికి కేఏ పాల్ ఫిర్యాదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 3:15 PM IST

KA Paul Complaint to EC on BRS Leaders : బీఆర్​ఎస్​ నేతలు దానం నాగేందర్, తాతా మధు ఎన్నికల కమిషనర్, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను బెదిరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో అందరికీ తెలుసన్న ఆయన.. దానం నాగేందర్​ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసీనే బెదిరిస్తారా అని పాల్ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే దొంగల పార్టీలో ఉండటం అవసరమా అని తలసాని శ్రీనివాస్ యాదవ్​ను ప్రశ్నించిన ఆయన.. బయటకు వచ్చి తమ పార్టీలో చేరాలని కోరారు. కాంగ్రెస్.. బీఆర్​ఎస్​కు బీ-పార్టీ అని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు గెలిచే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. లోకల్ గూండాల్లారా.. తమపై ప్రతాపం తగదని అన్నారు. పోలీసులు భయపడవద్దని, ఈ పార్టీలకు తొత్తులుగా ఉండవద్దని కేఏ పాల్ కోరారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదని.. ఈసారి ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.