కొల్లాపూర్ పోలీసులపై ఈసీకి జూపల్లి ఫిర్యాదు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 10:56 PM IST

Jupally Complaint to CEO Vikas Raj : కొల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు పోలీసు అధికారులు బీఆర్ఎస్​కు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారిని తక్షణమే బదిలీ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కలిసి ఆయన పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. కొల్లాపూర్​లో చాలా మంది పోలీసు అధికారులు దీర్ఘకాలికంగా ఒకే చోట ఉన్నారని వారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Jupally Comments on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రగతిభవన్ ఆడిస్తుంటే.. అధికారులు ఆడుతున్నారని జూపల్లి ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఫిర్యాదు ఇస్తే వారిపైనే కేసులు పెడుతూ నరకం చూపిస్తున్నారని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా లేవన్న కృష్ణారావు.. అధికారపక్షానికి కొమ్ము కాస్తున్న ఎస్సైలను వెంటనే బదిలీ చేయాలని కోరారు. పరిపాలనను గాలికి వదిలేసిన కేసీఆర్.. దీన్నే గొప్ప పరిపాలనగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తగిన బుద్ది చెప్పే సందర్భం వచ్చిందని జూపల్లి వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.