Jubilee Hills Fire Accident Today : బర్గర్ దుకాణంలో అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంక్.. తప్పిన పెను ప్రమాదం - Hyderabad latest news
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 2:28 PM IST
Jubilee Hills Fire Accident Today : జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నంబర్ 36లో ఉన్న బిగ్గిస్ బర్గర్ షాప్‌లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బర్గర్ షాప్ యజమాని.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వేగంగా మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్త చర్యగా బర్గర్ షాప్ పక్కన ఉన్న.. పెట్రోల్ బంక్‌ను మూసివేశారు. షాప్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఆస్తినష్టం తప్ప ప్రాణనష్టం ఏం సంభవించలేదని తెలిపారు. బర్గర్ షాపులో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుందని.. షాప్ యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఏదేమైనా ఈ మధ్యకాలంలో నగరంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. షాప్ యజమానులు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫైర్ సేఫ్టీ నియమాలను పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.