Jitta Balakrishna Reddys allegations : బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందంతోనే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షపదవి : జిట్టా బాలకృష్ణారెడ్డి
🎬 Watch Now: Feature Video
Jitta Balakrishna Reddy Allegations To Kishan Reddy : బీజేపీ నుంచి తననెందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఎ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్‌లను సస్పెండ్ చేయాలన్నారు. హైదరాబాద్ గన్ పార్కు వద్ద గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం.. మాట్లాడిన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్షపదవి లభించిందన్నారు. కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారని తెలిపారు. మూడు పర్యాయాలు పార్టీని నిర్వీర్యం చేసిన కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీని హైదరాబాద్‌కు పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ అరెస్టు చేస్తారనే భయం బీజేపీకి పట్టుకుందన్నారు.