'ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన జీవన్‌రెడ్డి' - Jagityala District News
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 2:49 PM IST
Jeevan Reddy Six Guarantees Bond in Jagital : కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. ముందుగా జగిత్యాల విద్యానగర్ రామాలయంలో పూజలు చేసిన ఆయన ఆలయం నుంచి బయటకు వచ్చి బాండ్ పేపర్ అఫిడవిట్‌ను జగిత్యాల ప్రజలకు చదివి వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తానని.. ఆంజనేయుని మీద ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు.
Jeevan Reddy Comments On KCR : కాంగ్రెస్ గాలి లేదు అంటున్న సీఎం కేసీఆర్.. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13కు 13 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని.. కేటీఆర్ సైతం ఓడిపోతారని జీవన్‌రెడ్డి జోస్యం చెప్పారు.