కొంగు పట్టకొని ఓట్లు అభ్యర్థించిన బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి - Bjp Election manifesto 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 4:08 PM IST

Jagtial BJP Candidate Boga Sravani Emotional at Press Meet : జగిత్యాలలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బోగ శ్రావణి తనను గెలిపించాలని.. తాను గెలువకపోతే బతకనివ్వరని కన్నీళ్ల పర్యంతమైంది. ఓట్లు ఒడిపట్టి అడుగుతున్నానని ఒడి చాటుతూ ఓటర్లను అభ్యర్థించారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. "ఒడిబియ్యం రూపంలో ఓట్లు అందించి.. మీ ఆడపిల్లను సంతోషంగా పంపిస్తారా? బతికించుకుంటారా? లేకపోతే నన్ను బతకనివ్వరు, ఇక్కడ ఉండనివ్వరు. మీ ఆడబిడ్డను గెలిపించుకోవాలా, వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది.. కన్నీళ్లతో వేడుకుంటున్నా" అని భావోద్వేగానికి గురయ్యారు.

తాను గెలిస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తానని బోగ శ్రావణి హామీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తనకు ఓటు వేసి కచ్చితంగా గెలిపించాలని కోరారు. ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.