Jagdish Reddy Interview : 'కేసీఆర్‌ వచ్చాకే.. సూర్యాపేటకు నీళ్లు వచ్చాయి'

🎬 Watch Now: Feature Video

thumbnail

Jagdish reddy Interview with Etv Bharat : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి.. లక్షమంది స్థానిక ప్రజలతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడారిగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీటిని అందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు గానూ కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్‌ పహాడ్‌ మండలం రావి చెరువు వరకు మొత్తం 68 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాలువ వెంట స్థానిక ప్రజలు గోదావరి జలాలకు జల హారతిని సమర్పించారు. చివ్వెంల మండల కేంద్రంలో జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం జలాలకు జలహారతిని సమర్పించారు. నీటి కరవుతో ఇబ్బందులు పడిన నేల.. నేడు సస్యశ్యామలంగా వెలుగొందని పేర్కొన్నారు. మొదట బోరు బావులు ఉపయోగించి.. 1000 అడుగుల వరకు వెళ్లిన నీటి లభ్యతలేని ప్రాంతంగా ఉండేదన్నారు. కాని కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చేశారని చెప్పిన మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.