IT Rides MP Kotha Prabhakar Reddy House : 'ఎన్నికల్లో బద్నాం చేసేందుకే.. నాపై ఐటీ దాడులు' - హైదరాబాద్లో ఐటీదాడులు
🎬 Watch Now: Feature Video
IT Rides at Medak MP Kotha Prabhakar Reddy House : ఎన్నికల ముందు తనను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తన నివాసంలోనూ, కంపెనీల్లోనూ జరుగుతున్న ఐటీ సోదాలపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తన ఆస్తులన్నింటికీ ఆధారాలు చూపిస్తానని ఆయన తెలిపారు. ఇప్పుడే ఎందుకు దాడులు చేస్తున్నారో ప్రజలు కూడా గమనించాలని సూచించారు.
ఐటీ దాడులు కేవలం బురదజల్లే ప్రయత్నమే అని వివరించారు. 1986 నుంచి తాను వ్యాపారం చేస్తున్నానని.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తనది పూర్తి వైట్ పేపర్ బిజినెస్ అని.. ఐటీ దాడులతో కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు. టీవీల్లో వచ్చేది ఒక రకంగా ఉంది.. ఐటీ అధికారులు తనతో మాట్లాడిన మాటలు మరొక రకంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ దాడులు చేస్తున్నట్లు బీజేపీపై మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీఆర్ఎస్ను.. రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఆపలేరని సవాల్ విసిరారు.