ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు-ఈ పరిణామాలు దేనికి సంకేతం?
🎬 Watch Now: Feature Video
Published : Nov 16, 2023, 10:10 PM IST
IT Raids in Telangana : ఎటు చూసినా కోలాహలంగా మారిన ఎన్నికల వాతావరణంలో ఉన్నట్లుండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఐటీ దాడుల అంశం. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకుల నివాసాల్లో, ఇతరచోట్ల ఐటీశాఖ చేపడుతున్న సోదాలే అందుకు కారణం. మాములు రోజుల్లో అయితే ఐటీ దాడులు సాధారణాంశమే. కానీ ఎన్నికలకు ముంగిట జరుగుతున్న ఈ పరిణామాల్ని మాత్రం ఎలా చూడాలి?
ఎన్నికల వేళ సహజంగా నల్లధనం పోగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది చట్టానికి చిక్కవచ్చనే ఉద్దేశంతోనే ఆదాయపుపన్ను దాడులు జరుగుతున్నాయని భావించవచ్చా? సహజంగా రాజకీయాల్లో ఉండే చాలామందికి వ్యాపారాలు ఉంటాయి. వారి వ్యాపార లావాదేవీలను పరిశీలించటానికి ఇన్‌కం టాక్స్ అధికారులు వెళ్లి ఉండవచ్చు. కానీ ప్రతిసారి రాజకీయరంగు ఎందుకు పులుముకుంటోంది? దేశ వ్యాప్తంగా ఈరోజు దర్యాప్తు సంస్థల విశ్వసనీయత ఎందుకు పదేపదే చర్చకు వస్తోంది? స్వతంత్రంగా వ్యవహరించట్లేదనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇదే విషయం ప్రతిసారి రాజకీయరంగు ఎందుకు పులుముకుంటోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.