IT Employees Protesting Chandrababu Arrest in Metro Stations : మెట్రోలో 'లెట్స్​ మెట్రో ఫర్​ సీబీఎన్​'.. పోలీసుల తీరుతో ఉద్రిక్తత - చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 1:57 PM IST

IT Employees Protesting Chandrababu Arrest in Metro Stations at Hyderabad : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు లెట్స్​ మెట్రో ఫర్​ సీబీఎన్​ కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం మెట్రో స్టేషన్ల​ వద్దకు భారీగా ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు. నల్ల షర్టులు, నల్ల టీషర్ట్స్​ ధరించి.. బాబు అరెస్టుకు నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్​ రావాలంటూ మద్దతు ప్రకటించారు. లెట్స్​ మెట్రో ఫర్​ సీబీఎన్​ కార్యక్రమంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మియాపూర్​ నుంచి ఎల్బీనగర్​ వరకు ఉన్న మెట్రో స్టేషన్లలో భారీగా పోలీసులను మోహరించారు. ఎల్బీనగర్​ మెట్రో స్టేషన్​లో అప్రమత్తమైన పోలీసులు.. నల్లషర్ట్​, టీషర్ట్సులు ధరించిన వారిని స్టేషన్​ లోపలికి అనుమతించలేదు. ఇంకా మెట్రో స్టేషన్​ ప్లాట్​ఫామ్​ పైనా తనిఖీలు నిర్వహించారు. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కదం తొక్కడంతో మెట్రో మియాపూర్​ నుంచి ఎల్బీనగర్​ వెళ్లే మెట్రో స్టేషన్లు పూర్తిగా రద్దీగా మారాయి. కొన్ని చోట్ల పోలీసులు.. నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.