IT Employees Protest TDP Chief Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల ఆందోళన - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ధర్నా
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2023, 4:00 PM IST
IT Employees Protest TDP Chief Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ సాప్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని అర్థరాత్రి అరెస్ట్ చేశారంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. 'అయామ్ విత్ సీబీఎన్' ప్లకార్డులతో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విప్రో సర్కిల్లో జరిగిన ఈ నిరసనలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. 'సైకో పోవాలి - సైకిల్ రావాలి' అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోని.. ఆయనను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ నిరసనతో విప్రో జంక్షన్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిచిపోకుండా చర్చలు చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.