IT Employees Car Rally Hyderabad : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. అడుగడుగునా పోలీస్ బందోబస్తు - కార్ల ర్యాలీకి పిలుపునిచ్చిన ఐటీ ఉద్యోగులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-09-2023/640-480-19593147-thumbnail-16x9-it-employees-car-rally.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 24, 2023, 11:07 AM IST
IT Employees Car Rally Hyderabad : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. పలువురు ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, ఎస్ఆర్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు.
దీంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కార్లలో వెళ్తున్న ఈ ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి సంఘీభావం తెలపనున్నారు. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్‌లోనూ నిఘా ఏర్పాటు చేశారు. ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత అనుమతిస్తున్నారు. దేశ, విదేశాల్లోనూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. నిరసనలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు.