ISRO Scientist Uma Maheswara Rao Interview : 'చంద్రయాన్-3 విజయంతో భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు పెద్దపీట' - చంద్రయాన్ 3 శాస్త్రవేత్త ఇంటర్వూ
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2023, 1:34 PM IST
ISRO Scientist Uma Maheswara Rao Interview : ప్రపంచ సాంకేతిక యవనికపై చంద్రయాన్-3 విజయం ద్వారా భారత్ సత్తా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని.. ఈ మహత్తర కార్యంలో భాగస్వామి కావడం గర్వంగా ఉందని ఖమ్మం జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. చంద్రయాన్-3 విజయం భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు పెద్దపీట వేస్తుందని ఈ యువ శాస్త్రవేత్త స్పష్టం చేశారు. ఈ విజయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురు శాస్త్రవేత్తలు పని చేశారని తెలిపారు.
ISRO Lander Module Operations Manager Interview : చంద్రయాన్-3 విజయం కోసం కీలకమైన ల్యాండర్ మాడ్యూల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పని చేయడం తన అదృష్టమన్నారు. చిన్నప్పటి నుంచే ప్రయోగాలపై తనకు ఆసక్తి ఉండేదని.. శాస్త్రవేత్త కావాలన్న సంకల్పంతోనే ముందుకెళ్లానని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కలల కోసం కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదన్నారు. శాస్త్రవేత్తలుగా రాణించేందుకు యువతకు ఇస్రో(ISRO) ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇస్రోలో శాస్త్రవేత్తలుగా రాణించాలంటే విపరీతమైన పోటీ ఉందని.. అయినప్పటికీ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే సాధించవచ్చని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తన లక్ష్యమంటున్న వల్లూరు ఉమామహేశ్వరరావుతో ప్రత్యేక ముఖాముఖి..