Eno Good Or Bad : 'ఈనో' తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు? - Is Drinking ENO GoodOrBad To Health DoctorsAnswer
🎬 Watch Now: Feature Video
Eno Good Or Bad : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. అయితే కొందరు పెద్దగా పట్టించుకోకుండా.. ఉన్న సమస్యను మరింతగా పెంచుకుంటారు. అలా మసాలా ఆహారాలు, జంక్ ఫుడ్ తిన్నప్పుడే కాకుండా తరచూ ఇతర చిరుతిళ్లు తినే వారిని కూడా ఈ గ్యాస్ సమస్య వేధిస్తుంటుంది. ఈ మధ్య ముఖ్యంగా యువతీయువకులు ఈ అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. దీనిని వారు తీవ్రమైన సమస్యగా పట్టించుకోకపోవడమే కాకుండా.. తాత్కాలిక ఉపశమనం కలిగించే మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందులో భాగంగానే అందరికీ అందుబాటులో ఉండే ఈనో ప్యాకెట్లను తెచ్చుకొని గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కానీ, తిన్న వెంటనే ఛాతి పట్టేయడం వంటి సమయాల్లో తాగుతున్నారు. మరి ఇలా అప్పటికప్పుడు రిలీఫ్ కలిగించే ఈనో వంటివి తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? అసలు తాగొచ్చా? తాగితే ఏ సమయాల్లో తాగాలి? ఎక్కువగా తాగితే ఏమౌతుంది? అనే విషయాలపై గ్యాస్ట్రోఎంటారలజిస్ట్ డాక్టర్ క్రిష్ణ మోహన్ ఏమంటున్నారో ఈ వీడియో చూసి తెలుసుకోండి.