TTD Sarva Darshan Tickets : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య ప్రజలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. తిరుమలలోని ఒక కేంద్రంలో నాలుగు కలిపి మొత్తం 91 కౌంటర్లను, తిరుపతిలో 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీని ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు అదే నెల 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని తెలిపారు. మిగిలిన తేదీలకు సంబంధించి ఒకరోజు ముందుగానే జారీ చేస్తామని చెప్పారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు పొందాలని, టోకెన్ల లేని భక్తులకు ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం - ఆ తేదీనే సర్వదర్శన టికెట్లు జారీ - SARVA DARSHAN TOKENS IN JANUARY
శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో వెల్లడి - జనవరి 10, 11, 12వ తేదీలకుగాను 9న 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని స్పష్టం
Published : Dec 26, 2024, 8:42 AM IST