Iphone 15 Sale In India : భారత్‌లో ఐఫోన్ మేనియా.. స్టోర్ల ముందు బారులు తీరిన టెక్ ప్రియులు - ఐఫోన్ 15 ఇండియా సేల్స్
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 10:16 AM IST
Iphone 15 Sale In India : టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 అమ్మకాలు భారత్‌లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాలు సందడి నెలకొంది. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలుపెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ముంబయిలోని బీకేసీ వద్ద ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు ప్రజలు భారీగా వచ్చారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీ సాకేత్‌లోని రెండో స్టోర్ వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రజలు లైన్లో నిలబడ్డారు. భారత్‌లో తొలి ఐఫోన్ 15 కోనుగోలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు కొనుగోలుదారుడు రాహుల్. "భారత్‌లో తొలి ఐఫోన్ 15 కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి లైన్లో నిలబడ్డాను. ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 14 ప్రో మాక్స్ నా వద్ద ఉన్నాయి. తాజాగా ఐఫోన్ 15 విడుదల కావడం వల్ల ఆ ఫోన్ కోసం వచ్చాను." అని చెప్పాడు. సెప్టెంబర్ 12న అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో 'వండర్ లస్ట్' పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 లను కూడా విడుదల చేసింది.