IMD Officer Nagaratna Interview : తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు

🎬 Watch Now: Feature Video

thumbnail

IMD Officer Nagaratna Interview : రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది. మరికొన్ని గంటల్లో మరింత బలహీనపడుతుందని తెలిపింది. రేపు ఉదయం వరకు దీని ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ రోజు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయన్నారు. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. రేపు భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్‌ ప్రకటించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 62 శాతం వర్షపాతం నమోదైందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.