Rain Alert: రాగల అయిదు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణశాఖ

By

Published : Apr 26, 2023, 3:51 PM IST

thumbnail

Interview with Hyderabad Meteorological Department official: ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ద్రోణి విదర్భ మీదుగా స్థిరికరించి ఉండటం వల్ల.. రాష్ట్రవ్యాప్తంగా రాగల ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన విస్తారంగా వర్షాలతో పాటు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ సీజన్​లో సిద్దిపేట జిల్లాలో 10 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదుకాగా.. గతంలో వరంగల్​లో జిల్లాలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద, ఎత్తయిన ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.