Akhira Ransomware Virus : అకీరా రాన్సమ్వేర్ వైరస్‌కు.. అడ్డుకట్ట వేయండిలా..! - Akhira virus ransomware
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-07-2023/640-480-19120346-1020-19120346-1690538547940.jpg)
Ethical Hacker Vishwanath Interview : నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ మనిషి నిజ జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతీదీ ఆన్‌లైన్‌మయం. కాలు బయటపెట్టకుండానే.. మనకు కావాల్సింది క్షణాల్లో పొందుతున్నాం. ఇంతే వేగంగా సైబర్ నేరాలూ జరుగుతున్నాయి. ఉచితంగా ఇస్తామంటూ ఎరవేస్తారు. వాటికి ఆశపడి క్లిక్ చేయగానే ఇక అంతే సంగతులు.. సమాచారమంతా తస్కరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డేటా చౌర్యం.. ప్రపంచాన్ని వణికిస్తున్న అంశం. సైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉంటూనే మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరా అనే రాన్సమ్ వేర్ వైరస్.. ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో పాటు ఇతర డేటాను దొంగలిస్తోందని దేశ భద్రతా సంస్థ హెచ్చరించింది. మరి సమాచార చౌర్యం కోసం ఈ అకీరా వైరస్ కంప్యూటర్లపై ఎలా దాడి చేస్తుంది..? డేటాను ఎలా ఇన్ క్రిప్ట్ చేస్తుంది? సిస్టంలోకి అకీరా వైరస్ సోకిందని ఎలా గుర్తించాలి? తదితర వివరాలపై ఎథికల్ హ్యాకర్ విశ్వనాథ్‌తో ప్రత్యేక ముఖాముఖి..