ప్రతి గల్లీలో తనిఖీలు చేస్తాం - ఎలాంటి ప్రలోభాలను తావివ్వం : రాచకొండ సీపీ చౌహాన్ - తెలంగాణ ఎన్నికలపై సీపీ చౌహాన్
🎬 Watch Now: Feature Video
Published : Nov 28, 2023, 7:12 PM IST
Interview With CP Chauhan About Telangana Polling : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలైన రోజు దగ్గరి నుంచి పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 750కోట్ల నగదు, నగలు, మద్యం పట్టుకున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు మరో ఎత్తు. ఉన్న ఒక్కరోజు పోలీసులు మద్యం, డబ్బు సరఫరాతో పాటు బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించాలి. పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రశాంతంగా సాగే బాధ్యత వారిపైనే ఉంటుంది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందుకు వెళ్తున్నారు. 24 గంటల తనిఖీలు, దాడులతో అప్రమత్తంగా ఉన్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెబుతున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించాలంటున్న రాచకొండ సీపీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.