కాస్తంత 'ఇంగువ'... కొండంత ప్రయోజనం.. అజీర్తి, బీపీ, నెలసరి సమస్యలకు చెక్​! - ఇంగువ మంచిదేనా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2023, 12:09 PM IST

Inguva Benefits In Telugu : ఇంగువ.. చాలా ఇళ్లల్లో రోజూ వాడుతుంటారు. అనేక వంటల్లో ఈ పదార్థాన్ని తప్పకుండా వేస్తుంటారు. ఇంగువ రుచి, వాసన కాస్త భిన్నంగా ఉన్నా ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. కాస్తంత ఇంగువ మనకు ఎంతో మంచి చేస్తుంది.
వంటల్లో ఇంగువ కొద్దిగా వాడినా చాలు. తిన్న ఆహారపదార్థాలను సులువుగా, ఇబ్బంది లేకుండా జీర్ణం చేస్తుంది. జీవక్రియకు కొంతవరకు మూలం ఇంగువే! ముఖ్యంగా పప్పు, సాంబార్, కూరల్లో ఇంగువ వాడకం ఎంతైనా ఆరోగ్యకరం. కాస్తంతా వేసినా.. కొండంత ప్రయోజనం ఉంటుంది.

ఇంగువ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

  • Inguva Powder Benefits : కార్బోహైడ్రేట్‌లు, పీచు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు, చర్మ ఆరోగ్యానికి సహకరించే నూనెలు.. ఇంగువలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే అజీర్తి, శ్వాసకోశ సమస్యలు, బీపీ, నెలసరి సమస్యలకు ఇంగువ చక్కని పరిష్కారం. ఊబకాయం రాకుండా కూడా చూస్తుంది.
  • ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని ఇంగువ చక్కగా కాపాడుతుంది. నలభై ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు బలహీనం అవుతుంటాయి. అటువంటి వారికి ఇంగువ మంచి ఉపశమనం ఇస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌, నిమోనియా, దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • మహిళల్లో ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేసి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా తగ్గిస్తుంది. నెలసరి క్రమం తప్పకుండా చేసి నొప్పిని అదుపు చేస్తుంది. వీటితో పాటు ఇంగువ వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ప్రముఖ న్యూట్రనిష్ట్​ పద్మారెడ్డి వివరించారు. అవి తెలుసుకునేందుకు వీడియోను చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.