Independence Day Celebrations in Adilabad :160 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరుగుతూ దేశభక్తిని చాటుకుంటున్న యువకులు.. - Adilabad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2023, 8:17 PM IST

Independence Day Celebrations in Adilabad : 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్న భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్‌డీబీఎస్‌ ఐటీ కంపెనీ 28లక్షలు వెచ్చించి నిర్మించిన 150 ఫీట్ల ఎత్తున్న జెండాపై జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత గృహ ఆవరణలో ఈ జెండాను ఆవిష్కరించగా.. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగు ప్రేమేందర్‌, మాజీ ఎంపీ నగేష్‌లతో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. జాతీయతను ఉట్టిపడేలా, అంతా కలిసి ఉండేందుకు ఈ భారీ  జాతీయ పతాకం చిహ్నంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  

 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువకులు 160 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరుగుతూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఆసిఫాబాద్​లోని కొమురం భీం చౌక్ నుండి ప్రారంభించి అంబేద్కర్ చౌక్ మీదుగా  పట్టణంలోని పుర వీధుల్లో జాతీయ జెండాతో తిరుగుతూ హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఐక్యత్యాన్ని చాటారు. అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడానికి ఆసిఫాబాద్ యూత్ ముందు అడుగులో ఉన్నారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నుండి మొదలుకొని పెద్దవారు కూడా పాల్గొన్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసి మెలిసి ఉండటానికి ఇదొక నిదర్శనం అని తెలియజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.