ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల నూతన ఆవిష్కరణ.. ఏమిటో మీరు చూడండి?
🎬 Watch Now: Feature Video
IIT HYDERABAD: సిమెంట్, మైక్రో సిలికా, ఇసుక, వాటర్, స్టీల్ ఫైబర్ వంటి స్థానికంగా లభించే పదార్థాలతో ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ పరిశోధక విద్యార్థుల బృందం సరళమైన ప్రత్యేక కాంక్రీట్‌ను అభివృద్ధి చేశారు. అల్ట్రా హై పెర్ఫార్మెన్స్ ఫైబర్ రీన్ఫోర్స్ కాంక్రీట్(యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ)గా దీనిని పిలుస్తున్నారు. అతి తక్కువ ధరకు దొరికేలా.. సిమెంట్, ఫైబర్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ఈ ప్రయోగం చేశారు. మనం ఉపయోగించే కాంక్రీట్ మిశ్రమం కన్నా ఎంతో నాణ్యత, ప్రామాణికంగా ఉంటుంది. ఐఐటీ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయబడిన యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ ధర వాణిజ్యపరంగా లభించే యాజమాన్య ఉత్పత్తుల కంటే దాదాపు రెండు రెట్లు తక్కువగా ఉంటోందని పరిశోధకులు తెలిపారు.“ఏ దేశ సమగ్ర అభివృద్ధికి బలమైన, ఎక్కువ మన్నికైన మౌలిక సదుపాయాలు తప్పనిసరి అని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. స్థానికంగా లభించే ముడి పదార్థాలను ఉపయోగించి మెరుగైన శక్తితో నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడం అనేది మన ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారానికి గొప్ప ముందడుగని ఆయన పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST