Hyderabad Steel Bridge Drone visuals : ప్రజారవాణాలో మరో మైలురాయి.. హైదరాబాద్​లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టీల్​బ్రిడ్జి - Hyderabad route map

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2023, 4:49 PM IST

Hyderabad Steel Bridge Inauguration Ceremony : ప్రజా రవాణాలో హైదరాబాద్​ మరో మైలురాయి చేరనుంది. ఇందిరా పార్కు వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం(SRDP)లో భాగంగా చేపట్టారు. సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ఇందిరా పార్క్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, అంబర్ పేట్, ఉప్పల్​కు వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులతో ఎన్నో బాధలు పడేవారని ఈ ఫ్లై ఓవర్​తో ట్రాఫిక్  ఇబ్బంది తొలగిపోనున్నాయి. ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా 4 జంక్షన్​లకు ఈ ఫ్లై ఓవర్​తో ట్రాఫిక్ సమస్య ఇక తప్పనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.