Hyderabad Police on Investment Frauds : 'క్లిక్‌ చేస్తే.. డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే' - ACP Prasad vigilant about investment scams

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2023, 7:56 PM IST

Hyderabad Police Awareness on Cyber Crimes :  సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల పెట్టుబడులు పేరుతో మోసాలపై అధిక సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో వందల కేసులు నమోదవుతున్నాయి. టెలిగ్రామ్‌, వాట్సప్​తో పాటు ఎస్‌ఎంఎస్​ల ద్వారా లింకులు పంపి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం పెట్టుబడుల పేరుతో మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన మోసాల్లో సైబర్ నేరగాళ్లు.. సుమారు రూ.100 కోట్లు కాజేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చేపలకు ఎర వేసినట్లుగా ముందు లాభం వచ్చినట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో యువత.. మధ్య వయస్సు వారిని నిండా ముంచుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే తమకి దృష్టికి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడైనా క్లిక్‌లు చేస్తే డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ట్రెండ్ మార్చుకుని ఇన్వెస్ట్​మెంట్ ఫ్రాడ్ పేరుతో జరుగుతున్న నేరాలపై.. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్​తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.