AIG Hospitals World IBD Day : 'ఆహార అలవాట్లలో మార్పులతోనే గ్యాస్ట్రిక్ సమస్యలు'
🎬 Watch Now: Feature Video
AIG Hospitals World IBD Day In Hyderabad : ఆహార అలవాట్లలో మార్పులు రావడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని.. ఆహారం తీసుకునే సమయంలో సమతుల్యం పాటించాలని ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ వరల్డ్ ఐబీడీ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐబీడీ సమస్యలు అధికం కావడంతో వాటి మీద సర్వే చేయడం జరిగిందన్నారు. ఐబీడీ సమస్యకు ప్రధాన కారణం ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులుగా తేలిందన్నారు.
ఐబీడీ సమస్య మూడు స్టేజీలలో ఉంటుందని.. మొదటి స్టేజీలో ఆహారం అలవాట్లు మార్చుకుంటే సరిపోతుందని.. రెండో స్టేజీలో అయితే చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందని.. మూడో స్టేజీలో క్యాన్సర్తో ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి రాకుండా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని.. జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇంటిలో వండిన ఆహారం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవని.. కానీ ఉద్యోగ రీత్యా భార్యాభర్తలు ఇద్దరు బయట ఆహారం తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటప్పుడు ఐబీడీ సమస్యలు వస్తాయని తెలిపారు. ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఐబీడీ సమస్య తక్కువగా ఉందని.. దానికి మనం తీసుకునే ఆహార అలవాట్లు కారణమని పేర్కొన్నారు. అనంతరం సరైన పౌష్టికాహారం.. సరైన డైట్ ఎలా తీసుకోవాలి అనే దానిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.