Crop Damage in Bhupalpally : నోటికూడి బువ్వ నేలపాలాయే - వరంగల్ రైతుల పంట నష్టం
🎬 Watch Now: Feature Video
Crop Damage in Bhupalpally : ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా చేతికొచ్చే సమయంలో నీటిపాలైందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి నియోజవర్గ పరిధిలో ఘనపూర్, రేగొండ, చిట్యాల,టేకుమట్ల, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాల్లో భారీగా ఈదురు గాలులతో వీయడంతో, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, వరి, మామిడి తోటలు, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటను కల్లాల్లో ఉంచగా.. అది కూడా వర్షార్పణమైంది.
భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పరిహారం అందించాలని కోరారు.
అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి రేయింబవళ్లు కష్టపడి వేసిన పంట.. వర్షం కారణంగా నేల రాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. వడగండ్ల వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం చెంచు కాలినిలోని మామిడి తోటలో 7టన్నుల వరకు మామిడి కాయలు రాలాయని తోట యజమానులు చెబుతున్నారు.